Wednesday, November 26, 2008

విశాఖపట్నం నుంచి తిరుపతి కి ..

విశాఖపట్నం నుంచి తిరుపతికి వెళ్ళాలి అనుకునే వారు ముందుగ ఒక ఆలోచన ఉంటే , తిరుపతి లో ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే, విశాఖ లోని ఎం .వి. పి కాలనీ లో గల టి.టి.డి. వారి రేసోర్వషన్ కౌంటర్ కి వెళ్లి టి.టి.డి. లో దర్శనం, వసతి టికెట్ లు బుక్ చేసుకుంటే మంచిది. రెండు, మూడు నెలలు ముందు కూడా టి.టి.డి. టికెట్ లు బుక్ చేసుకోవచుచు. దీని వలల ప్రయాణం లో స్పష్టత కలుగుతుంది. టికెట్లు రిజర్వు చేసుకున్నాక చేయాల్సిన మరో పని వెంటనే రైల్ టికెట్ కూడా రిజర్వు చేసుకోవడం. ఈ క్రింది రైళ్ళు తిరుపతి కి వేలతై. విశాఖ నుంచి తిరుపతి కి ఏడు వందల ముఫై ఆరు కిలో మీటర్ల దూరం ఉంది.

* హౌరా యశ్వంత్ పూర్ ఎక్ష్ప్రెస్స్ - ప్రతి రోజు ఉదయం పదకొండు ఇదు నే. లకు విశాఖ లో బయలు దేరు తుంది అదే రోజు రాత్రి పదకొండు నలభై కి తిరుపతి చేరుకుంటుంది - స్లీపెర్ క్లాసు లో ఒకరి ప్రయాణానికి మూడు వందల ఆరు రూపాయలు ఖర్చు అవుతుంది.
* పూరి తిరుపతి ఎక్ష్ప్రెస్స్ - రాత్రి పదకొండు పదిహేను నిమిషాలకు విశాఖలో బయలు దేరుతుంది మరుసటి రోజు సాయంత్రం నాలుగు ఇదు కు తిరుపతి కి చేరుకుంటుంది- ఒకరి కి ప్రయాణం ఖర్చు రెండువందల తొంభై మూడు రూపాయలు.
*తిరుమల ఎక్ష్ప్రెస్స్ - ప్రతి రోజు మధ్యాన్నం ఒకటి ఇదు నిమిషాలకి విశాఖ లో బయలు దేరి తరువాతి రోజు ఉదయం ఇదు గంటలకు తిరుపతి చేరుకుంటుంది - ప్రయాణం ఖర్చు ఒకరికి రెండు వందల ఎనభై ఆరు రూపాయలు.

ఈ రైళ్ళలో ఖాళీల ను తెలుసు కోవదాని కి ఇంటర్నెట్ లో రైల్వే వారి వెబ్ సైట్ చూడటం manchidi

No comments: